18-02-2026 12:00:00 AM
ఫ్రాన్స్ దశాబ్దాలుగా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ముంబైలో ద్వైపాక్షిక అంశాలపై మోదీ, మేక్రాన్ చర్చలు
ఉగ్రవాదంపై పోరుకు భారత్‌కు సహకరిస్తామన్న మేక్రాన్
భారత్ - ఫ్రాన్స్ మధ్య 20కి పైగా కీలక ఒప్పందాలు
ముంబై, ఫిబ్రవరి 17: ఫ్రాన్స్ సహకారం తో ఎవరెస్ట్ అంత ఎత్తుకు వెళ్లగలిగే హెలికాప్టర్లను తయారుచేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో ని లోక్ భవన్‌లో మంగళవారం సమావేశమైన ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మేక్రాన్ ద్వైపాక్షిక అంశాలపై చర్చిం చారు. అంతకుముందు, కర్ణాటకలోని వేమగల్లో ఎయిర్ బస్ హెచ్-125 హెలికాప్టర్ల త యారీ అసెంబ్లీ లైన్‌ను మోదీ, మేక్రాన్ కలి సి వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్, ఫ్రాన్స్ సంబంధాలు ప్రత్యేకమైనవని అన్నారు. ఆ దేశం దశాబ్దాలుగా భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా ఉందన్నారు. ‘భారత్‌కు పురాతన వ్యూహాత్మక భాగస్వామిగా ఫ్రాన్స్ కొనసాగుతోంది. రఫేల్ జెట్ నుంచి సబ్ మెరైన్ వరకు రక్షణ రంగంలో సహకారం అందించుకుంటున్నాయి. ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్లను ఫ్రాన్స్ సహకారం తో భారత్‌లోనే తయారు చేయనున్నాం.
యావత్ ప్రపంచానికి ఇక్కడ నుంచే ఎగుమతి అవుతాయి. అంతర్జాతీయంగా అనిశ్చి తులు నెలకొన్ని వేళ.. ప్రపంచ స్థిరత్వానికి ఐ దు దేశాల భాగస్వామ్యం ఓ శక్తిగా మారుతుంది. బహుళ ధ్రువ ప్రపంచాన్ని మేం వి శ్వసిస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మాట్లాడుతూ ఉ గ్రవాదంపై పోరులో భారత్‌కు సహకరిస్తామని తెలిపారు.
౨౦ ఒప్పందాలివే..
స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్: భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల స్థాయి పెంపు.
హెలికాప్టర్ అసెంబ్లీ లైన్: కర్ణాటకలోని వేమగల్లో టాటా-ఎయిర్ బస్ సంయుక్త తయారీ కేంద్రం ప్రారంభం.
హెచ్-125 తయారీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎగిరే హెలికాప్టర్ల స్వదేశీ ఉత్పత్తి
30,000 మంది విద్యార్థులు: 2030 నాటికి ఇంతమంది భారతీయ విద్యార్థులను ఆహ్వానించనున్న ఫ్రాన్స్.
ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్: 2026 సంవత్సరాన్ని ఆవిష్కరణల సంవత్సరంగా ప్రకటన.
ఇండో-ఫసిఫిక్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్: ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ఒప్పందం.
డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్: అత్యాధునిక డిజిటల్ పరిశోధనల కోసం ఉమ్మడి కేంద్రం ఏర్పాటు.
నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్: విమానయాన రంగంలో నైపుణ్యాభివృద్ధికి ఒప్పందం.
రక్షణ ఎగుమతులు: భారత్‌లో తయారైన హెలికాప్టర్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే ప్రణాళిక.
ఫ్రాన్స్ 2030 ప్లాన్: 50 బిలియన్ యూరోల పెట్టుబడుల భాగస్వామ్యం.
స్టార్టప్ ఎక్స్ఛేంజ్: ఇరు దేశాల స్టార్టప్ల మధ్య సాంకేతిక బదిలీ, సహకారం.
క్లీన్ ఎనర్జీ: స్వచ్ఛ ఇంధన వనరుల అభివృద్ధిపై వ్యూహాత్మక ఒప్పందం.
అంతరిక్ష పరిశోధన: స్పేస్ సెక్టార్లో ఇరు దేశాల అంతరిక్ష సంస్థల మధ్య సమన్వయం.
ఇండో-పసిఫిక్ సహకారం: సముద్ర తీర భద్రత, స్వేచ్ఛాయుత వాణిజ్యం.
ఐఎంఈసి కారిడార్: ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ పురోగతిపై చర్చలు.
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్: సౌర శక్తి వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఉమ్మడి కృషి.
ఎంఎస్‌ఎంఈ బలోపేతం: చిన్న, మధ్య తరహా పరిశ్రమల మధ్య వాణిజ్య బంధం.
సాంస్కృతిక మార్పిడి: కళలు, సినిమా రంగాల్లో పరస్పర సహకారానికి ఒప్పందాలు.
సైబర్ సెక్యూరిటీ: సైబర్ దాడుల నియంత్రణ, డేటా భద్రతపై కీలక నిర్ణయాలు.
మౌలిక సదుపాయాలు: పోర్టులు, రవాణా రంగాల్లో ఫ్రెంచ్ కంపెనీల పెట్టుబడులు.