7 April, 2026 | 11:57 AM

Breaking News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •  

ఏఐ సదస్సులో సమస్యలు

18-02-2026 12:00 AM

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు  

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 :  భారత్ అతిథ్యమిస్తున్న  ఏఐ ఇంపార్ట్ సదస్సులో సరైన సౌకర్యాలు లేకపోవడంపై  కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. సదస్సు సజావుగా, సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ‘ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ సమిట్ ఈరోజు 70వేల మంది ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. సోమవారం జరిగిన సమిట్‌లో ఎవరైనా సమస్యలు ఎదుర్కొని ఉంటే దానికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరుతున్నాం.

మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి మా బృందం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది’ అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా, సోమవారం సాయంత్రం ఏఐ సమ్మిట్ ప్రారంభమైన సమయంలో భారత మండపం వద్ద సిబ్బంది రద్దీని నియంత్రించకపోయారని ( పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వెనకగా పేర్కొన్నారు. అందరికి సరిపడా కుర్చీలు, ఇతర సదుపాయాలు లేవన్నారు.