1 May, 2026 | 2:04 AM

జనగణనలో బీసీల భవిష్యత్తు దాగుంది

01-05-2026 12:00 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం

ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రారంభమైన జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియపై బీసీ వర్గాల్లో చర్చలు ముమ్మరమవుతున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో సాగుతున్న ఈ ప్రక్రియ భవిష్యత్ సంక్షేమ విధానాలపై నేరుగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో సామాజిక వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ముఖ్యంగా బీసీల వాస్తవ పరిస్థితులు గణాంకాల్లో ప్రతిబింబిస్తాయా లేదా అన్నది కీలకంగా మారిందన్నారు.

ఈ మేరకు గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఓబీసీ సెల్ నేషనల్ ఇన్చార్జ్ కత్తి వెంకటస్వామి, వీజీఆర్ నారగోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం మాట్లాడుతూ ప్రతి ఇంటి సమాచారం విధానాల పునాది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఓబీసీ ఇన్చార్జ్ సూర్యనారాయణ, అఖిలభారత యాదవ సంఘం అధ్యక్షులు రాములు యాదవ్, సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డా.రాజ్ నారాయణ ముదిరాజ్, మట్ట జయంతి గౌడ్, పుష్పలీల గౌడ్, శివ యాదవ్, మహేష్ యాదవ్, జిల్లా నరేందర్, జయరాజ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ నాయకులు, యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.