15 April, 2026 | 3:21 AM

నారబోయిన కనకయ్య అంతిమయాత్రలో పలువురు నేతల నివాళి

23-02-2026 08:40 PM

మునుగోడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజు తండ్రి, మునుగోడు మండల పరిషత్ రిటైర్డ్ ఉద్యోగి నారబోయిన కనకయ్య (82) మృతి చెందగా, సోమవారం నిర్వహించిన ఆయన అంతిమయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ సిపిఐ రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు పాల్గొని

పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నారబోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కనకయ్య మరణ వార్త తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఫోన్ ద్వారా నారబోయిన రవిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.