18 April, 2026 | 3:31 PM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతూకం

18-06-2025 12:33 AM

ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురి దారుణ హత్య

చర్ల/బీజాపూర్, జూన్ 17: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారు ణం చోటుచేసుకుంది. ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. బీజాపూర్‌లోని పెద్దకోర్మ గ్రామంలో మం గళవారం సాయంత్రం ఇటీవల పోలీసుల ఎదు ట లొంగిపోయిన మావోయిస్టు మాజీ సభ్యుడు దినేశ్ మొడియం కుటుంబానికి చెందిన ముగ్గురిని మావోయిస్టులు కీలక సమాచారం అను మానం తో నరికి చంపారు.

మృతులను జింగు మొడి యం, సోమ మొడియం, అనిల్ మద్విగా గుర్తించారు. అందులో ఏడుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.   ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. బీజాపూర్ జిల్లాలో, తూర్పు బస్తర్ డివిజన్ పార్తాపూర్ ఏరియా కమిటీ, పశ్చిమ బస్తర్ డివిజన్ భైరామ్గఢ్ ఏరియా కమిటీకి చెందిన మొత్తం 24 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసుల ముందు లొంగిపోయారు.