7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్?

05-03-2026 02:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడుపుతూ, దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన సరెండర్ అయినట్లు తెలుస్తున్నది. సుదీర్ఘకాలంగా భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గణపతి లొంగుబాటు.

ఢిల్లీ పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గణపతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రభుత్వ వర్గాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గణపతి సరెండర్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచినప్పటికీ.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్‌ఐబీ చీఫ్ ఐజీ బి. సుమతి తదితర పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.