15 June, 2026 | 7:54 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో మరిపెడ పాఠశాల విద్యార్థులు

24-02-2026 12:00 AM

మరిపెడ, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): మరిపెడ ఉన్నత పాఠశాల విద్యార్థులు పూజ, భవాని,  ఝాన్సీ,  గౌతమి, సాయి ప్రసన్న,  అంకిత,  లహరి,  సవీనా, సాహితీ, మానస లు  హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ ఆఠ్యా పాఠ్యా గేమ్ లో స్కూల్ విన్నర్స్ గా నిలిచారు.

అలాగే యోగా పోటీలో సబ్ జూనియర్ విభాగంలో లోకేష్, జూనియర్ విభాగంలో ఆఫ్రిద్, క్యారం పోటీ లలో జూనియర్ విభాగంలో డానియల్ సీనియర్ విభాగంలో చరణ్, భాను ప్రకాష్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు, వ్యాయామ ఉపాధ్యాయురాలు రాజకుమారి, స్టాఫ్ సెక్రటరీ బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులు విజేతలను అభినందించారు.