భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను ఆర్జించాయి. మదుపర్లు ఒక్కరోజే 14 లక్షలు కోట్ల ఆదాయం ఆర్జించారు. దేశియ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభాపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభాపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ధి చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే ప్రపంచం, దేశంలో సానుకూల సంకేతాలు మార్కెట్ కు పాజిటివ్ ట్రెండ్ ను తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా స్థాక్ లు బాగా పుంజుకోవడంతో ఈ వారాంతంలో బుల్ స్టాక్ బెట్టింగ్ లలో ప్రభావం కనిపించింది. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.18 శాతం, 1.39 శాతం చొప్పున పెరిగాయి. దీంతో మదుపర్లు ఒక్కరోజే దాదాపు 14 లక్షల కోట్లకుపైగా సంపాదించారు.






