ఈ ఏడాది 500 బిలియన్ డాలర్లకు ఎగుమతులు : ఫియో

17-05-2024 12:33:58 AM

ముంబై, మే 16: భారత్ వస్తూత్పత్తుల ఎగుమతులు ప్రస్తుత 2024  25 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధిచెంది 500 బిలియన్ డాలర్లకు చేరతాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) అంచనా వేసింది. 2023 24లో 437 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. మెషినరీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, ఫార్మా, బయో టెక్నాలజీ ఎగుమతులు జోరుగా పెరుగుతాయని,  కేంద్రం అందిస్తున్న ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహ కాలు ఈ రంగాలు వృద్ధిచెందుతున్నాయని ఫియో ప్రెసి డెంట్ అశ్విని కుమార్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వీసుల ఎగుమతులు 390 బిలియన్ డాలర్ల మేర ఉంటాయని అంచనా వేస్తున్నామన్నారు. భారత్‌కు సాంప్రదాయ ఎగుమతి మార్కెట్లయిన యూఎస్, యూరప్‌లతో పాటు ఆస్ట్రేలియా, యూఏఈలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు పెరుగుతాయని కుమార్ వివరించారు.  సర్వీసుల విభాగంలో మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, మెడికల్ టూరిజం వృద్ధి చెందుతున్నాయని అశ్విని కుమార్ అన్నారు.