18 April, 2026 | 10:58 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కల్యాణం.. కమనీయం

06-06-2025 12:39 AM

కన్నుల పండుగగా శ్రీ ఎల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి కల్యాణమహోత్సవం 

ఇబ్రహీంపట్నం, జూన్ 5: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, మల్లికార్జున స్వామి కళ్యాణమహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ కన్నెమోని లింగం యాదవ్ ఆధ్వర్యంలో ఒగ్గు పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అన్నప్రాసన వితరణ కార్యక్రమాని నిర్వహించారు. ఈ కల్యాణమహోత్సవానికి ముఖ్య అథితిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరైయారు.

ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ ఎల్లమ్మ తల్లి, మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను గొంగడి గొర్రెపిల్లతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారి, అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భూపాతిగాళ్ల మహిపాల్, ఈసీ శేఖర్ గౌడ్, ముత్యాల రాజశేఖర్ రావు, మాజీ ఉపసర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు ఇదులకంటి నరేష్ గౌడ్, రావణమని లింగం ముదిరాజ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులుపాల్గొన్నారు.