రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఓ వివాహిత ఆత్మహత్య(Married Woman Commit Suicide) చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆలియా బేగం అనే వివాహిత తన భర్తతో గొడవ పడ్డి పాటిగడ్డలోని పుట్టింట్లో ఉంటుంది. మనస్తాపానికి గురైన ఆలియా బేగం సంజీవయ్య పార్కు(Sanjeevaiah Park) వద్ద రైలు పట్టాలపైకి వచ్చింది. అటుగా వస్తున్న రైలు ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
కుమార్తెను కాపాడుకునేందుకు వచ్చిన తండ్రి మహ్మద్ అలీను రైలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) పేర్కొన్నారు.






