18 March, 2026 | 2:26 AM

వివాహిత అదృశ్యం

18-03-2026 01:02 AM

కడ్తాల్, మార్చి 17 (విజయక్రాంతి): వివాహిత అదృష్టమైన ఘటన కడ్తాల్  మండలం లో చోటు చేసుకుంది. పల్లె చెలుక తండా కు చెందిన సరిత (19) అదృష్యమైనట్లు కడ్తాల్ సీఐ గంగాధర్ మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..

సరితకు 8 నెలల క్రితం గోవిందాయపల్లి తండకు చెందిన పవన్‌తో వివాహం జరిగింది. గత రెండు నెలలుగా భార్య,భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో పంచా యితీ నిర్వహించి అత్తారింటికి పంపించారు. ఈనెల 15వ తేదీన సాయంత్రం ఆమె ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.