12 April, 2026 | 7:25 PM

కేంద్ర బ్యాంక్‌ల పాలసీ నిర్ణయాలు

18-12-2024 12:06 AM

రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి తగ్గడం, వాణిజ్యలోటు రికార్డు గరిష్ఠస్థాయికి పెరగడం ఈక్విటీలు ఒత్తిడికి లోన వుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసె ర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మరోవైపు ఈ వారంలో పలు దేశాల కేంద్ర బ్యాంక్‌లు.. యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ (బీవోజే), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీవోఈ) కీలకమైన పాలసీ నిర్ణయాలు వెలువడనున్న తరుణంలో ఇన్వెస్టర్లను నిరాశ ఆవహించిందన్నారు. ఇప్పటికే మార్కెట్ డిస్కౌం ట్ చేసుకున్నదని, భవిష్యత్ రేట్లబాటపై ఫెడ్ వ్యాఖ్యానాలపైనే ఇన్వెస్టర్ల దృష్టి నిలిచి ఉన్నదని నాయర్ వివరించారు.

అయితే అమెరికా జీడీపీ పటిష్ఠంగా కొనసాగడం, నవంబర్‌లో వినిమయ ధరలు గత ఏడు నెలల్లో ఎన్నడూలేనంత అధికంగా పెరగడం, జనవరిలో చైనా, మరికొన్ని దేశాల దిగుమతులపై డోనాల్డ్ ట్రంప్ టారీఫ్‌లు పెంచే అవకా శం తదితర అంశాలతో 2025లో ఫెడ్ రేట్ల కోతపై అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే అమెరికా జీడీపీ పటిష్ఠంగా కొనసాగడం, నవంబర్‌లో వినిమయ ధరలు గత ఏడు నెలల్లో ఎన్నడూలేనంత అధికంగా పెరగడం, జనవరిలో చైనా, మరికొన్ని దేశాల దిగుమతులపై డోనాల్డ్ ట్రంప్ టారీఫ్‌లు పెంచే అవకా శం తదితర అంశాలతో 2025లో ఫెడ్ రేట్ల కోతపై అనుమానాలు ఏర్పడ్డాయ ని తెలిపారు. 

భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 18 బుధవారం అర్థరాత్రి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ నిర్ణయం వెల్లడిస్తారు. బీవోజే, బీవోఈలు రేట్లను యథాతథంగా అట్టిపెడతాయన్న అంచనాలు ఉన్నాయి.