నేటి నుంచి ఈనెల 24 వరకు మార్వాడి మహిళా చైతన్య యాత్ర
ముషీరాబాద్, జూలై 19(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మార్వాడీ మహిళా చైతన్య యాత్ర మార్వాడీ మహిళా సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ మార్వాడీ మహిళా సమ్మేళన్- సమాజ్ కల్యాణ్ సమితి జాతీయ అధ్యక్షురాలు రాజ్కుమారి బాల్టీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు నగరంలోని కోఠి బడీచౌడి ప్రాంతం నుంచి ఈ యాత్ర ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగనుందని వివరించారు.
ఈ మేరకు ఆదివారం హైదర్గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షురాలు శానూవర్మా, జాతీయ ఉపాధ్యక్షురాలు లీలా బజాజ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు శోభాజీ ఢాగాలతో కలిసి జాతీయ అధ్యక్షురాలు రాజ్కుమారి బాల్దీ మాట్లాడుతూ మార్వాడీలో మహేశ్వరీ, జైన్, ఖండేల్వాల్, బ్రాహ్మణ్, సునార్, పోర్వాల్, చౌరసీయ్, మెడత్వాల్, దసౌరా, నీమా, ప్రజాపత్, గుర్జర్, కుంబార్ అనే మొత్తం13 వర్గాలు. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నివసిస్తున్నారని వివరించారు జహా జాతీహై బైల్ గాడీ..
వహా జాయేగా మార్వాడీ.. అనే నినాదంతో మార్వాడీ కులస్థులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థిరపడి వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చడమే కాకుండా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
మార్వాడీ మహిళల సంక్షేమం, అభ్యున్నతి, సాధికారతే ధ్యేయంగా తమ సంఘాలు దేశవ్యాప్తంగా కృషి చేస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో మార్వాడీ మహిళా సమ్మేళనాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మార్వాడీ మహిళలల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆరోగ్య, విద్య, ఉపాధితో పాటు వారి సంక్షేమం, అభ్యున్నతి, సాధికారతతో పాటు భారతీయ మార్వాడీ సంస్కృతీ, సంప్రదాయాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ కళలు, గో సంరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ చైతన్య యాత్రలు నిర్వహించ తలపెట్టినట్లు వెల్లడించారు.






