సీసీ రోడ్డు పనులు ప్రారంభం
20-07-2026 12:00 AM
తాడ్వాయి, జూలై, 19( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పిర్మాయకుంట తండాలో ప్రతినిధులు సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు గ్రామాల్లో ప్రత్యేక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో తండాకు సిసి రోడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు.
ఈ నిధులతో సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వారు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక గణపతి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని రాజలింగం, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ షౌకత్ అలీ, నాయకులు శ్రీకాంత్, రమణారెడ్డి, పండరి నాయక్, సంతోష్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.






