26 May, 2026 | 4:21 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

మాస్ జాతర ఫ్యాన్స్‌కు విందు భోజనమే..

27-01-2025 12:00 AM

రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మి స్తున్నారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఆదివా రం ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది.

“మాస్ జాతర’ గ్లింప్స్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన రవితేజను గుర్తు చేసేలా ఉంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టునర్‌గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతోంది.

‘మనదే ఇదంతా” అనే డైలాగ్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోం ది. రవితేజ-, శ్రీలీల జోడి గతంలో ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ అందుకున్నా రు. వీరి కలయికలో ‘మాస్ జాతర’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందు కోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

తాజాగా విడుద లైన గ్లింప్స్ ‘మాస్ జాతర’ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేశాయి. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.