16 August, 2026 | 6:59 PM

విజయ్ చివరి చిత్రం జన నాయగన్

27-01-2025 12:00 AM

దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాను ‘దళపతి 69’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభించారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘జన నాయగన్’ అనే టైటిల్‌తో దళపతి విజయ్ చివరి చిత్రం రాబోతోంది. ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌లోని సెల్ఫీతో టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిస్తోంది.

ఈ మూవీ విజయ్ పొలిటికల్ కెరీర్‌కి ఫేర్ వెల్‌గా ఉండబోతోంది. టైటిల్, పోస్టర్ అన్నీ ఆయన రాజకీయ జీవితానికి అద్దం పడుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.