యథార్థ చారిత్రక ఘటనలతో..
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘వీడీ 14’. ఈ సినిమా బ్రిటీష్ కాలం నాటి కథ నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా సెట్‌వర్క్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ -“గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘వీడీ 14’ సెట్‌వర్క్ ప్రారంభించాం.
బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంగా వచ్చిన చిత్రాల్లో ఇప్పటిదాకా ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ‘వీడీ 14’ ఒక పవర్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది” అన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.






