18 June, 2026 | 1:37 AM

సామూహిక అక్షరాభ్యాసం

18-06-2026 12:00 AM

మహబూబాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పండగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెచ్ ఎం తేలుకుంట్ల సునీత మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే గొప్ప లక్ష్యాలను నిర్దేశిం చుకుని విద్యాభ్యాసం ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం చిన్నారుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కల్పించేలా సాగింది. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం తిరువేంకటాచార్యులు, ఏపీసీ చైర్మన్ చెరుకుపల్లి పద్మ, ఉపాధ్యాయ బృందం మమత, జ్యోతి, వినోద్ కుమార్, రామారావు  పాల్గొన్నారు.