18 June, 2026 | 1:55 AM

వానమ్మ వానమ్మ.. ఒక్కసారి వచ్చి పోవే వానమ్మా

18-06-2026 12:00 AM
  1. జూన్ మాసంలో అంతంతమాత్రంగానే వర్షాలు 
  2. ఆచితూచి అడిగిస్తున్న రైతులు 

నిర్మల్ జూన్ 16 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈ యే డు జూన్ మాసం లో నెలకొన్న హర్ష బావ పరిస్థితులు రైతులను ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ మోసం ప్రారంభమై 15 రోజులు గడిచిపోతున్న జిల్లాలో వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండడంతో ఖరీఫ్ పంటల సాగు ముందు కు సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజుల నుండి ఒకటి రెండు సార్లు కొద్దిపాటి వర్షం కురవడంతో రైతులు భూములను దుక్కులు దున్నుకొని సదులుకొని విత్తనాలు వేసుకున్నందుకు సిద్ధమయ్యారు.

అయితే జిల్లా వ్యాప్తంగా ముధోల్ ప్రాంతంలో కొ ద్దిగా వర్షం కురిసినప్పటికీ నిర్మల్ కడెం కా నాపురంలో వర్షం తక్కువ స్థాయిలో కురవడంతో విత్తనాలు వేసుకోవాలా వద్ద అనే రీ తిలో రైతులు ఆలోచిస్తున్నారు. నిర్మల్ జిల్లా లో ఖరీఫ్ సీజన్లో 4. 60 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు చేస్తారు.   ఇందులో ప్రధానంగా పత్తి పంట 1,60,000 ఎకరా లు, సోయా 1.10 లక్షల ఎకరాలు,   వరి1.30 లక్షల ఎకరాలు, మొక్కజొన్న  80 వేల ఎకరాలు, ప్రధాన పంటలుగా సాగు చేస్తుండగా మిగతావి పప్పు దినుసులు పసుపు ఇతర పంటలు  సాగు చేస్తారు. 

వర్షాలు లేక రైతుల ఇబ్బంది 

జూన్ మాసం ప్రారంభమై 15 రోజులు దాటిపోయిన నిర్మల్ జిల్లాలో సగటు వర్షపాతం ఇప్పటికి నమోదు కాలేదు. గత ఏడా ది ఇదే సీజన్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం కురువగా ఈసారి అది 100 లోపే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికీ ఖరీఫ్ సా గుకు కు సిద్ధమైన రైతులు పంట భూములను దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసు కునేందుకు సిద్ధం చేశారు. జూన్ మాసంలో కురిసిన తొలకరి వర్షాలకు పత్తి సోయా మొక్కజొన్న తదితర పంటలు  సాగుచేసే రైతులు విత్తనాలు ఎరువులను కొనుగోలు చే సుకుని పంట భూముల్లో వెత్తుకుంటున్నారు.

కొద్దిపాటి వర్షం కురవడం వల్ల భూమిలో తేమ శాతం తక్కువ ఉండడంతో విత్తనాలు వేస్తే అవి మొలకెత్తకపోయి ప్రమాదం ఉందని రైతులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ బైంసా నిర్మల్ ఖానాపూర్ డివిజన్లో పెద్ద ఎత్తున రైతులు వర్షం కురుస్తుందన్న ఆశతో ఎండు భూముల్లోనే పత్తి విత్తనాలను వెతుకుతున్నారు. మార్కెట్లో పత్తి విత్తనాలు ఎరువులను కొనుగోలు చేసిన రైతులు కూలీల సాయంతో పంటలను విత్తుకుంటూ వర్షాలు కురవాలని వేసిన విత్తనాలు మొలకెత్తాలని ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు.

అయితే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ రెండు రోజుల నుంచి మళ్లీ పెరగడం ఎండలు ఎక్కువగా ఉండడంతో భూ మిలో వేస్తున్న విత్తనాలు 50% కూడా మొ లకెత్తలేదని మొలకెత్తిన విత్తనాలు తేమలేని కారణంగా వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లా వ్యా ప్తంగా వ్యవసాయ సాగు 50 శాతం మా త్రమే పూర్తయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షాలు కురిస్తే నిర్మల్ జిల్లాలో పంటల సాగు జోరు అందుకునే అవకాశం ఉండడంతో ప్రతిరోజు రైతులు ఆకాశవైపు వర్షాలు కురవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

వ్యవసాయ శాఖ అప్రమత్తం 

నిర్మల్ జిల్లాలో జూన్ మాసంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో వ్య వసాయ శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో కు రువలసిన సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం కురిసిన నేపథ్యంలో భూమిలో తేమ లేని కారణంగా విత్తనాలు వేస్తే అవి మొలికెత్తి అవకాశాలు తక్కువని రైతులు భా రీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలు వే సుకోవాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రచా రం చేస్తున్నారు.

పత్తి సోయా మొక్కజొన్న తదితర పంటలు వేసుకునే రైతులు విత్తన రూపంలో నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ గ్రామాల్లో ఈ ప్రచారం నిర్వహి స్తోంది. జిల్లా వ్యాప్తంగా సాగు ప్రణాళిక కనుగుణంగా రైతులకు అవసరమయ్యే విత్తనా లు ఎరువులను అందుబాటులో ఉంచి అవి అక్రమాలకు గురికాకుండా ప్రత్యేకంగా చేస్తున్నారు.

ముఖ్యంగా ఎరువుల పంపిణీలో పా రదర్శకత ప్రత్యేక యాప్ అందుబాటు తెచ్చి ఆన్లైన్ బుకింగ్ చేసి రైతులకు సాగు భూమి ప్రణాళిక ఆధారంగా ఎరువులను అందిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కుంటాల, ముధోల్   తానూర్ను బాసర్, ముధోల్ లోకేశ్వరం న ర్సాపూర్ సారంగాపూర్ దిల్వార్పూర్ మండలంలో పత్తి అధికంగా సాగు చేస్తారు. వర్షం పైనే ఆధారపడి వర్షాలు పడాలనిఈ భగవంతుని ప్రార్థిస్తున్నారు.