19 న విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా
పోస్టర్ ఆవిష్కరణ
కామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ఏప్రిల్ 2026 నుండే జరగాల్సి ఉండగా యాజమాన్యం ఇంతవరకు స్పందన లేకుండా, కనీసం కమిటీనైనా నియమించలేదని ఉద్యోగ సంఘాల JAC నాయకులు తెలిపారు. ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులందరు చలో విద్యుత్ సౌదా కు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ లో భాగంగా కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బోయ కమలాకర్ మాట్లాడుతూ, పి ఆర్ సి అనేది విద్యుత్ కార్మికుల ప్రాథమిక హక్కుఅని అన్నారు.
ఈపీఎఫ్ నుంచి జిపిఎఫ్ కు మార్చాలని, సాధారణ బదిలీలు పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు, ఆర్టిజన్ కు ఏ పీ ఎస్ ఈ బి రూల్ ను అమలు పరచాలని, డిమాండ్ చేస్తూ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నీ ప్రతీ విద్యుత్ ఉద్యోగి విధిగా మహా ధర్నాకు హాజరు కావాలని కోరారు. ధర్నా ఆవిష్కరణ కార్యక్రమం లో విద్యుత్ ఉద్యోగులు మెహెర్ బాబా,లక్ష్మి నర్సింహా,ప్రదీప్ కుమార్ తో పాటు 100 మంది విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.






