17 August, 2026 | 2:43 PM

రెండేళ్లుగా భూమి ఆన్‌లైన్ కోసం రైతు ఎదురుచూపులు

17-08-2026 01:41 PM

తంగళ్ళపల్లి, ఆగస్టు 17,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం(Tangallapalli Mandal) అంకుసాపూర్ గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి నాగిరెడ్డి తన భూమిని ఆన్‌లైన్ చేయాలని రెండు సంవత్సరాలుగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తన సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తన భూమిని ఆన్‌లైన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని నాగిరెడ్డి కోరారు.