16 May, 2026 | 12:42 AM

గ్రామీణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు

16-05-2026 12:00 AM

త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం

  1. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 2047 నాటికి 10 శాతానికి పెంచుతాం
  2. నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత వసూళ్ల పర్వానికి తెరలేపిన బీజేపీ 
  3. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు ఎందుకు పెంచారు?
  4. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  5. సంగారెడ్డి జిల్లా తొగర్‌పల్లిలో కేజేఎస్ మెగా ఫుడ్ పరిశ్రమకు శంకుస్థాపన
  6. హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, మే 15 (విజయక్రాంతి)/కొండాపూర్: దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 2047 నాటికి 10 శాతానికి పెంచేలా ‘తెలంగాణ రైజింగ్ విజన్’ ద్వారా రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లి గ్రామంలో శుక్రవారం రూ.651 కోట్లతో 44 ఎకరాల్లో నెలకొల్పనున్న కేజేఎ స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ -2 మెగా ఫుడ్ పరిశ్రమకు మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, సురేష్ షెట్కార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీదర్‌బా బు మాట్లాడుతూ.. అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల వచ్చే అర్బన్ ప్రాంతాల్లో సమస్యలు రా కుండా పకడ్బందీ ప్రణాళికలతో పారిశ్రామికీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. పరిశ్ర మలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. 

భారీ ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు 

తొగర్‌పల్లిలో రూ.651 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ నూతన యూనిట్ ద్వారా 1,551 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 5,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీదర్‌బాబు వెల్లడించారు. పరిశ్రమల స్థాప న ద్వారా స్థానిక యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్ వంటి గ్లోబల్ బ్రాండ్లకు కో- మాన్యుఫ్యాక్చరింగ్ పార్ట్‌నర్‌గా ఉన్న కేజేఎస్ సంస్థ రాకతో ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాలలో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొగర్‌పల్లిలో నిర్మించే ఈ పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితమన్నారు.

రాబోయే కాలం లో అంతర్జాతీయ కారిడార్‌లో ఓ ఇండస్ట్రీ నెలకొల్పుతామని చెప్పారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూని ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మె ల్సీ అంజిరెడ్డి, కంపెనీ ప్రతినిధులు, టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. 

ఎన్నికల తర్వాత బీజేపీ వసూళ్ల పర్వం

నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం వసూళ్ల పర్వానికి తెరలేపిందని మంత్రి శ్రీదర్‌బాబు ఆరోపించారు. సంగారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని, పెట్రోల్ ధరలు ఒకేసారి మూడు రూపాయలు పెంచారని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ధరలు పెంచలేదని, ఎన్నికల తర్వాత వసూళ్లు మొదలు పెట్టారని విమర్శించారు.

అంతర్జాతీయ స్థా యిలో చమురు ధరలు పెరిగినప్పుడు ధర లు పెంచని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రో ధరలు ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యమని, రాష్ట్ర ప్రజల బాగు కోసం పని చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ కాలుష్య నివారణ కోసం తీసుకున్నామని చెప్పారు. సీఎం, మంత్రులు అందరం కలిసి పని చేస్తున్నామని, క్యాబినేట్‌లో అందరం కలిసి నిర్ణ యాలు తీసుకుంటామన్నారు. 

రైతులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు

రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకి లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ధాన్యం మార్కెట్లోకి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో లారీలు ఆలస్యంగా వస్తే దాన్ని అదనుగా తీసుకుని బీఆర్‌ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి రెండు రోజులకు ఓసారి ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్ష చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దు, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని మంత్రి హామీనిచ్చారు.

కాగా ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని, నీట్ ఎగ్జామ్ నేషనల్ లీకేజీ ఏజెన్సీగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్నారు. చట్టాలను బీఆర్‌ఎస్ చుట్టాలుగా చేసుకున్నట్టు తాము ప్రవర్తించమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని తెలిపారు.