14 March, 2026 | 1:40 AM

చందానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

14-03-2026 12:29 AM

కాలిబూడిదైన ఫర్నిచర్

శేరిలింగంపల్లి, మార్చి 13 (విజయక్రాంతి): చందానగర్ ప్రధాన రహదారిలో ఉన్న అను ఫర్నిచర్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణంలోని ఐదు అంతస్తుల్లో నిల్వ చేయబడిన ఫర్నిచర్ మొత్తం తగలబడింది.స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బం ది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. 7 ఫైర్ ఇంజన్లు, 11 వాటర్ ట్యాంకర్ల తో మంటలను అదుపులోకి తెచ్చారు.

దుకా ణం ఐదు అంతస్తుల భవనంలో ఉండటం, లోపల సోఫాలు, బెడ్లు, ఇతర వస్తువులు ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూ ట్, గ్యాస్ లీకేజీ లేదా ఇతర కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమా పక అధికారులు సంయుక్తంగా ఘటన స్థలం లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.