17 June, 2026 | 1:24 AM

కెమికల్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

17-06-2026 12:18 AM
  1. ఖాళీ స్థలంలో చెలరేగిన మంటలు
  2. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఘటన

కుత్బుల్లాపూర్, జూన్ 16(విజయక్రాంతి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కెమికల్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని వసంత కెమికల్స్ కంపెనీకి చెందిన పాత రియాక్టర్లు ఉన్న ఖాళీ స్థలంలో మంటలు చెలరేగడంతో భారీగా పొగ వ్యాపించింది. పొగ, మంటల ప్రభావంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఫైర్ సిలిండర్లు,వాటర్ పైపులతో కంపెనీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.