12 August, 2026 | 2:47 PM

దేవరాయాంజాల్‌లో భారీ అగ్నిప్రమాదం

12-08-2026 01:51 PM

'కోల్డ్‌రష్‌ లాజిస్టిక్స్‌' గోదాంలో భారీగా మంటలు

షామీర్‌పేట్‌: మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్‌ మండలం(Shamirpet Mandal) దేవరయాంజాల్‌లోని 'కోల్డ్ రష్ లాజిస్టిక్స్' గిడ్డంగిలో(Coldrush Logistics warehouse) బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు. గిడ్డంగి నుండి దట్టమైన పొగలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు.