12 August, 2026 | 3:33 PM

జువెలరీ షాపు దొంగతనం

12-08-2026 02:31 PM

అనుమానితుడి సీసీ ఫుటేజ్ విడుదల

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని అగ్రసేన్ భవన్ సమీపంలో ఉన్న సంతోష్ జువెలరీ షాపులో ఈ నెల 9న జరిగిన దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఫుటేజ్‌లో కనిపిస్తున్న వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు వెంటనే కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ ప్రేమ్‌కుమార్ కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అనుమానితుడి గురించి సమాచారం తెలిసిన వారు సీఐ ప్రేమ్‌కుమార్ – 8712670507, పీసీ నాగరాజు – 9177631231 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.