12 August, 2026 | 3:48 PM

హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న నగర మేయర్

12-08-2026 02:37 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్  పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా టవర్ సర్కిల్ వరకు నిర్వహించిన  జాతీయ జెండా ర్యాలీలో విద్యార్థులు, యువత, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్  కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశ సమైక్యత, జాతీయ గౌరవం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్  వై.సునీల్ రావు, బీజేపీ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు తనుకు సాయికృష్ణ, కార్పొరేటర్లు గుగ్గిల్లపు రమేష్, వంగల పవన్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, తాటి ప్రభావతి, గొట్టుముక్కల ఉమారాణి వెంకటరమణ, దేవసాని సరస్వతి సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు బల్బీర్ సింగ్, కన్న కృష్ణ, నాయకురాలు వరాల జ్యోతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.