12 August, 2026 | 3:48 PM

పాఠశాలలో అరటి మొక్కలు నాటిన నగర మేయర్

12-08-2026 02:40 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్  అరటి మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మొక్కలను నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమని, చిన్నప్పటి నుంచే ప్రకృతి పట్ల ప్రేమ, చెట్ల పెంపకం పట్ల బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు సువర్ణ ప్రాశన చుక్కలు వేస్తూ చిన్నారుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్లపు రమేష్, ఏపీపీ చంద్ర, మాసం గణేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.