మాదాపూర్ టాటా షోరూంలో భారీ అగ్నిప్రమాదం
12-07-2026 12:00 AM
శేరిలింగంపల్లి, జూలై 11 (విజయక్రాంతి): మాదాపూర్ మెయిన్ రోడ్డులోని టాటా మోటార్స్ షోరూమ్లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొత్త కార్లు, ఫర్ని చర్, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరి గినట్లు ప్రాథమిక అంచనా. షోరూమ్లో సి బ్బంది లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానం. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






