12 July, 2026 | 2:24 AM

పీడీఎస్‌యూ జాతీయ కోశాధికారిగా కందుకూరు గణేష్ ఎన్నిక

12-07-2026 12:00 AM

ముషీరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ప్రగతిశీ ల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశం శనివారం దిల్‌సుఖ్‌నగర్ అమరవీరుల ప్రాంగణంలో నిర్వహిం చారు. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పిడిఎస్ యు జాతీయ కోశాధికారిగా  కందుకూరు గణేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా గణేష్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలన్నారు.

23 లక్షల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  యూనివర్సిటీలలో బ్రా హ్మణయ్య హిందు ఫాసిస్ట్ శక్తుల జ్యోతిని వ్యతిరేకిద్దామన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిం చాలని డిమాండ్ చేశారు.  విదేశీ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు.