‘సర్’ను బీఎల్‌ఓలు విజయవంతం చేయాలి
మాజీ కార్పొరేటర్ గజ్జెల నాగేశ్
సికింద్రాబాద్, జూలై 11 (విజయ క్రాం తి): ప్రజలకు, ముఖ్యంగా నిరక్షరాస్యులకు ఫారాలు నింపడంలో స్థానిక బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు అండగా నిలిచి సహాయం చేయాలని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి దరఖాస్తు ఫారాలు అందేలా చూసి, సకాలంలో సేకరించి సమర్పించాలని గజ్జెల నాగేశ్ అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల సర్వే కార్యక్రమంఅత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ఓల్ బోయిన్ప ల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ నివాసంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్‌ఏ) జరిగిన ప్రత్యేక అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ పార్టీ ఎస్‌ఐఆర్ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జెల నాగేశ్, మాజీ కార్పొ రేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతంగా అమలు చేసే విధానాలు, బీఎల్‌ఏల బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్దేశం చేశారు.
బీఎల్‌ఏ తమకు కేటాయించిన పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమావేశంలో గజ్జెల నాగేశ్, ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్, కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, కార్యదర్శి హరినాథ్, బీఎల్‌ఏలు, నాయకులు పాల్గొన్నారు.






