సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల భారీ ఆపరేషన్
237 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
శేరిలింగంపల్లి,జూలై 19 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ బృందాలు ఈ వీకెండ్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి భారీ స్థాయిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అరెస్టు చేశాయి.ఈ తనిఖీల్లో మొత్తం 237 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు.
అందులో 205 మంది బైక్ రైడర్లు,28 మంది కారు డ్రైవర్లు, నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారు. తనిఖీల సమయంలో చాలా మంది డ్రైవర్ల రక్తంలో మద్యం స్థాయి 36 ఏంజీ నుంచి 200 ఎంజీ వరకు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 219 మందిపై ఈ రేంజ్లో మద్యం శాతం నమోదైంది. గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధిత 309 కేసులు పరిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో ఐదుగురికి జైలు శిక్షలు విధించినట్లు తెలిపారు.






