20 July, 2026 | 6:52 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

ఇంటి దొంగతనం కేసు ఛేదన

20-07-2026 12:20 AM

నిందితుడి అరెస్ట్.. రూ.౫౧వేల నగదు స్వాధీనం 

కొల్చారం జూన్ 19: మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఇంటి దొంగతనం కేసును కొల్చారం పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి అర్ధ తులం బంగారు ఉంగరం, రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన నాయిని రాయన్న (62) ఇంట్లో ఈ నెల 6వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో ఆదివారం ఏడుపాయల టీ జంక్షన్ వద్ద ఎస్‌ఐ మోహినొద్దిన్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన దుబ్బగళ్ల అలియాస్ నిరుడి కృష్ణ (43) అనుమానాస్పదంగా ప్రయాణికుల ఆటోలో మెదక్ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు.

ప్రారంభంలో సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా, నాయిని రాయన్న ఇంట్లో తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి అర్ధ తులం బంగారు ఉంగరం, రూ.51 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం మెదక్ జేఎఫ్సీఎం కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.