ఘనంగా మేడే ఉత్సవాలు
అయిజ మే 1: అయిజ మున్సిపాలిటీ మరియు గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగిల్ విండో చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింహ హాజరయ్యారు.
జెండా ఆవిష్కరణ అనంతరం పోతుల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శతాబ్దం కింద చికాగో నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్ణీత పని గంటలకై జరిగిన ఆందోళనలో అప్పటి యజమానులు దిగివచ్చి ఎనిమిది గంటల పనివిధానాన్ని మరియు మరికొన్ని కార్మిక చట్టాలను తీసుకువచ్చాయని నాటి నుంచి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కుల మత ప్రాంతాల కతీతంగా జరుపుకొనే ప్రపంచ ఏకైక పండగ మేడే పండుగ అని అన్నారు. మరియు పులికల్ గ్రామంలో అసంఘటిత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పురవీధుల గుండా మేడే నినాదాలు చేస్తూ తిరిగారనీ జిల్లా కోఆర్డినేటర్ జి నరసింహులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
పెబ్బేరు పట్టణంలో
పెబ్బేరు, మే 1: అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే డే సందర్భంగా పెబ్బేరు పట్టణ భావన నిర్మాణ తాపీ కార్మిక సంఘం, మున్సిపాలిటీలో మణికంఠ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘ నంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షుడు నందిమల్ల రా ములు అధ్యక్షత వహించారు.ఈ సందర్భం గా కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రతపై నాయకులు ప్రసంగించారు.
కార్మికుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి కార్మికుడు తన హక్కుల కోసం చైతన్యంగా ఉండాలని సూచించారు. కార్మికుల కష్టమే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బాలస్వామి, మధు, బాలయ్య, సురేష్, పెంటన్న, నరసింహ, రాములు, వెంకటేష్, కురుమూర్తి, కురుమూర్తి, కృష్ణ, కృష్ణ, విష్ణు, మన్యం. తిరుపతి, బాలస్వామి, మైబు, హనుమంతు, జనర్దన్, రాములు, ఎల్లస్వామి తదితర సంఘ కార్మికులు పాల్గొన్నారు.
- సీపీఐ, సీఐటీయూ నేతల పిలుపు
నాగర్ కర్నూల్/బిజినేపల్లి/కొల్లాపూర్ రూరల్/కల్వకుర్తి మే 1 (విజయక్రాంతి): ఉద్యమాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులు నేడు ప్రపంచీకరణ ప్రభావంతో ప్రమాదంలో పడుతున్నాయని, వాటి రక్షణ కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ, సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.
బిజినేపల్లి మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన 141వ మేడే ఉత్సవాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ ఆధ్వ ర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్, ఈర్ల చంద్రమౌళి, మారేడు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కొల్లాపూర్ లో పట్ట ణంలో జరిగిన మేడే కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి. ఫయాజ్ మాట్లాడుతూ, కార్మిక హక్కులు కాపాడుకోవా లంటే ఐక్య పోరాటం తప్పనిసరి అన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని, మేడే స్ఫూర్తితో ఎర్రజెండా కింద ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తుమ్మల శివుడు, జి. కురుమయ్య, ఎం.డి. యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో.. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు. కల్వకుర్తి పట్టణంలోని సిపిఐ కార్యాల యంలో నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో తాలూకా సహాయ కార్యదర్శి దాసు, మండల నాయకులు నేరటి రాజు, పోలె పురుషోత్తం, గంజి శివుడు, బ్రహ్మం, వాడాల బాలస్వామి,ఓర్సు లక్ష్మణ్, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కార్మికులకు అండగా బిఆర్‌ఎస్
జడ్చర్ల,మే 1:అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని జడ్చర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ పక్కన శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఆర్టియు కార్మిక జెండాను ఎగురవేశారు. మహిళ కార్మికులకు చీరలను మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చేతులు మీదుగా పంపిణీ చేశారు.
అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం బిఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని,కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. కార్మికులందరికీ బిఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందారని గుర్తు చేశారు.కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసిఆర్ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, మాజీ సర్పంచుల సంఘం మాజీ కార్యదర్శి ప్రణిల్ చందర్, టౌన్ అధ్యక్షులు పిట్టల మురళి, కార్మిక సంఘాల నాయకుడు, చంద్ ఖాన్, శ్రీనివాస్ యాదవ్,మాజీ ముడా డైరెక్టర్ ఇంతియాజ్ ఖాన్, పార్టీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, కరాటే శ్రీను, వివిధ కార్మిక సంఘాల నాయకులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా 141వ మేడే దినోత్సవ వేడుకలు
గద్వాల టౌన్ మే1 గద్వాల పట్టణంలో 141వ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి. ఆంజనేయులు వివిధ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కా ర్మిక వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ,శ్రా మిక హక్కుల రక్షణ కోసం ఐక్యంగా ముం దుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో వివిధ ప్రజా సంఘాల నాయకులు,కార్మిక సంఘాల నాయకులు,కార్మికులు, తదితరు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






