14 August, 2026 | 10:11 PM

Breaking News

ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ.. నిందితుల అరెస్ట్   •   ఘనంగా తిరంగా యాత్ర ర్యాలీ   •   చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరిపించాలి   •   విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •  

కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగిద్దాం

02-05-2026 12:36 AM

బచ్చోడులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

తిరుమలాయపాలెం, మే 1 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ గ్రామ కార్యదర్శి ఆడెపు నగేష్ జెండా ఎగురవేయగా, రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ జెండాను ఆవిష్కరించి అనంతరం కార్మికుల హక్కులపై ప్రసంగించారు. శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, కనీస వేతనాలు, పని భద్రత, సామాజిక రక్షణ అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని, శ్రామిక ఉద్యమాల అవసరం ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు. మేడే ప్రాముఖ్యతను వివరించి కార్మికుల త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గొర్రెపాటి వీరస్వామి, మాగి విజయ్, సకినాల వెంకన్న, వల్లపు బిక్షం, రామకృష్ణ, కోటయ్య, డి కృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.