13 July, 2026 | 4:37 PM

Breaking News

విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •   పిల్లల ఆరోగ్య రక్షణలో నులిపురుగుల నిర్మూలన ఎంతో ముఖ్యం   •   ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం   •  

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి

06-04-2026 12:38 AM

మాజీ కార్పొరేటర్  చిత్రా సుబ్రమణ్యం

జవహర్‌నగర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): అమ్మలగన్న అమ్మ ఓం శక్తి మరి యమ్మ అని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని మాజీ కార్పొరేటర్ చిత్ర సుబ్రమణ్యం అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ శాంతి నగర్ కాలనీలో మరియమ్మ అమ్మవారికి ఆదివారం మాజీ కార్పొరేటర్ చిత్రా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు.

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే గ్రామ దేవతగా పేరుగాంచిన ఈ అమ్మవారు వర్షాలు ఆరోగ్యం రక్షణ ప్రసాదించే శక్తి స్వరూపిణి గా భక్తులు విశ్వసిస్తారు అన్నారు. అనంతరం అలిగిరి చిత్ర సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో తమిళ సోదరు లు, సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి  పూజలు నిర్వహించారు. శాం తినగర్ ప్రజలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.