calender_icon.png 4 August, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మయసభ అద్భుతాలు సృష్టించాలి

01-08-2025 12:35:26 AM

సోనీ లివ్ నుంచి రాబోతున్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. దేవా కట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వంలో విజయ్‌కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మించిన ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో గురువారం ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ.. “మయసభ’ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దేవా కట్టా మాట్లాడుతూ.. “మయసభ’ అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం” అని తెలిపారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. “దేవా కట్టా కలను ‘మయసభ’ టీమ్ నిజం చేసింది”’ అన్నారు.

నిర్మాత శ్రీహర్ష మాట్లాడుతూ .. “మయసభ’.. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది” అని చెప్పారు. చైతన్యరావ్, నిర్మాత విజయ్‌కృష్ణ లింగమనేని, సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ, బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ, చరితా వర్మ, నటీనటులు దివ్యా దత్తా, శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, కెమెరామెన్ సురేశ్, మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్, కో డైరెక్టర్ కిరణ్, మిగతా బృందం పాల్గొన్నారు.