calender_icon.png 4 August, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీ గుండె గుమ్మంలోకి..

01-08-2025 12:36:56 AM

హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ‘ఊపిరి ఊయలలాగా..’ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ‘నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజూ వస్తూ పోతుంటావు ఊపిరి ఊయలగా..’ అంటూ సాగే ఈ పాటకు తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారాలపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ పాటకు హిందీలో ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.