01-08-2025 12:33:56 AM
నారా రోహిత్ 20వ సినిమా ‘సుందరకాండ’. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మాతలు. వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌కుమార్ కథానాయికలు. ఈ సినిమా నుంచి మేకర్స్ ‘ప్లీజ్ మేమ్..’ అనే పాటను విడుదల చేశారు. శ్రీహర్ష ఈమాని సాహిత్యం అందించగా.. అర్జున్ చాందీ, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాస్, సాయిశరణ్, రేష్మా శ్యామ్, హరిప్రియ, లవితా లోబో పాడారు.