12 July, 2026 | 12:35 PM

ఐపీఎల్‌కు మయాంక్ దూరం

05-05-2024 12:05 AM

లక్నో: పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. పొత్తి కడుపునొప్పితో బాధపడుతున్న మయాంక్ లీగ్‌కు అందుబాటులో ఉండడని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో మయాంక్ నిలకడగా 155 కిమీ వేగతో బంతులు విసిరి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసిన మయాంక్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒక దశలో అతడిని టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది.

సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసిన మయాంక్ సైడ్ స్ట్రెయిన్‌తో తప్పుకున్నాడు. నాలుగు వారాల పాటు రీహాబిలిటేషన్‌లో గడిపిన మయాంక్ ముంబైతో మ్యాచ్‌కు తిరిగి వచ్చాడు. కానీ మ్యాచ్‌లో 3.1 ఓవర్లు బౌలింగ్ వేసిన అనంతరం మయాంక్ పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడాడు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో మయాంక్ యాదవ్ ఐపీఎల్‌కు దూరమైనట్లు లాంగర్ పేర్కొన్నప్పటికి జట్టు మేనేజ్‌మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.