సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
వనపర్తి టౌన్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శనివారం తన ఛాంబర్‌లో జిల్లా పరిధిలోని అన్ని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మున్సిపాలిటీలో పారిశుధ్యం నిర్వహణ సహా పలు అంశాలపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పట్టణాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి, దోమల వ్యాప్తి నివారణతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.






