నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
మంచినీటి సరఫరా లోపంపై వాటర్ వరక్స్ డీజీఎం నిలదీత
ముషీరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ జలమండలి అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతి నగర్, సబర్మతి నగర్ బస్తీల్లో నాలుగు రోజులుగా మంచినీరు సరఫరా నిలిచిపోవడంతో బస్తీల ప్రజలు మా జీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మంగళవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ స్థాని క బస్తీ ప్రజలతో కలిసి వాటర్ వరక్స్ కార్యాలయంలో డీజీఎం వెంకట్ రెడ్డిని కలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రంగు నీ ళ్లు, కలుషిత నీటి సరఫరాతో అనారోగ్యం పాలై, ఆందోళన చెందిన డివిజన్ ప్రజలకు, ఇప్పుడు నీటి సరఫరా నిలిపివేయడం వాట ర్ వరక్స్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
వెంటనే మంచినీటి సరఫరా అందిం చకపోతే డివిజన్ ప్రజలతో కలిసి జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చ రించారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన వాటర్ వరక్స్ డీజీఎం సమీపంలోని ముఖ్యమైన పైప్‌లైన్‌లో రిపేర్ల కారణం గా సరఫరా నిలిచిపోయిందని, రేపటికల్లా పనులు పూర్తి చేసి మంచినీటి సరఫరా అందజేస్తామని హామీ ఇచ్చినట్లు వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజే పీ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, బస్తీ వాసు లు లక్ష్మయ్య, రాము, యాదగిరి, ధనరాజ్, రవిచంద్ర, శ్రీను, ప్రశాంత్ పాల్గొన్నారు.






