10 June, 2026 | 1:38 AM

అక్రమ కట్టడాలను నిలిపివేసిన మున్సిపల్ అధికారులు

10-06-2026 12:51 AM

అయిజ జూన్ 9 : అయిజ మునిసిపల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో కొన్ని అక్రమ కట్టడాలను నిలిపివేస్తున్నామని మునిసిపల్ అధికారి టి పి బి ఓ అన్నారు. ఇట్టి కట్టడం  గతంలోకూడ నిర్మిస్తుంటే సరియైన ఆధారాలు లేని కారణంగా నిర్మాణాన్ని నిలిపివేశామని అన్నారు.

ఇది మాజీ మునిసిపల్ కౌన్సిలర్ దని,ఇక్కడ ఇంకా కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని అవి కోర్టు వివాదంలో నడుస్తున్నాయని, ఇలాంటి ప్రభుత్వ భూములపై నిర్మిస్తున్న అక్రమ కట్టడాలు గతంలోని అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడం వల్లే ఇ లాంటివి నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజల్లో చర్చ కొనసాగుతుంది.

కావున అధి కారులు ఇటువంటి కట్టడాలపై ఉక్కు పాదం మోపి ప్రభుత్వ భూములు రక్షించాలని ప్రజలనుకుంటున్నారు. వివరణ : - టిపిబి ఓ ని వివరణ అడుగగా సరియైన ఆధారాలు లేని కారణంగా ఇట్టి కట్టడాలను నిలిపివేస్తు న్నామని ఇటువంటివి సరైన ఆధార్ లేని కట్టాడాలు మా దృష్టికి వస్తే ప్రభుత్వ సహకా రంతో వాటిని కూడా నిర్మూలిస్తామని టి పి బి ఓ సాత్విక్ అన్నారు.