12 July, 2026 | 6:13 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

తాగునీటికి సమస్య రాకుండా చర్యలు

21-03-2025 12:00 AM
  • కలెక్టర్, ఎస్పీ, అధికారులతో సమీక్ష
  • ఐటీ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాలు

కాటారం, మార్చి 20 (విజయక్రాంతి) : వేసవిలో నియోజక వర్గంలో మంచినీటి స మస్య తలెత్తకుండా చూడాలని,  అధికారు లు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నీ టి సమస్య రాకుండా  చూడాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు తెలిపారు. గురువారం కాటారం  సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని కా టారం, భూపాలపల్లి డివిజన్లులో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు.  సబ్ డివిజన్ పరిధిలో 30 బోర్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, అవసరం ఉన్న గ్రామాలలో ఏర్పాటు చే యాలని తెలిపారు.

కాటారం సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో మినీ స్టేడియం, చిల్డ్రన్ పార్కు నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి ఏ ర్పాట్లు చేయాలని  తెలిపారు. గ్రామాలలో సోలార్ పవర్ ద్వారా నీటి మోటార్ల ఏర్పాటుకు ప్రతి పాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

సి.ఆర్.ఆర్ ద్వా రా  ఉట్ల పోచమ్మ , దామరకుంట నుండి మానేరుకు వెళ్ళే రోడ్డు, ఒడిపిలవంచ గ్రా మాలలో నాలుగు రోడ్లు నిర్మాణానికి నిధు లు మంజూరు చేయడం జరిగిందని, వాటి నిర్మాణ పనులను వెంటనే  చేపట్టాలని స్ప ష్టం చేశారు.  ఏ.సి.డి.పి నిధుల ద్వారా నిర్మాణంలో ఉన్న  పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

కాటరం సబ్ డివిజన్ కేంద్రంలో మంజూరు చేసిన  కూరగా యల మార్కెట్, కమ్యూనిటీ హాలు నిర్మాణాలను టెండర్లను పిలిచి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.  కాట రం సబ్ డివిజన్‌కు అంబులెన్సు, వైకుంఠ రథాలు ఏర్పాటుకు నిధులు మంజూరు చే యడం జరిగిందని వెంటనే ఏర్పాటు చే యాలని తెలిపారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్   ఛైర్మెన్ అయిత ప్రకాశ్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరె, సబ్ కలెక్టర్ మయంక్ సింగ్, డిఆర్డిఓ నరేష్, డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, తహసిల్దార్ నాగరాజు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ రాజశేఖర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.