11 May, 2026 | 3:35 PM

సమస్యల పరిష్కారానికి చర్యలు

11-05-2026 02:13 PM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, డి ఆర్ ఓ వేణు తో కలిసి ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.పలువురు భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, ఉపాధి అవకాశాలు కల్పించాలని దరఖాస్తులు అందజేశారు. ఐ కే పి వి ఓ ఏ లు వారి సమస్యలు పరిష్కారం చేయాలని లేక పోతే ఈ నెల 18 నుండి సమ్మె కు దిగుతామని నోటీసు అందజేశారు.వీటితో పాటు పలువురు అటవీ భూముల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.