20-02-2026 07:37:32 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్.(విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఈ నెల 17న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇండోర్, అవుట్‌డోర్ ఆటల పోటీల్లో రాణించిన జిల్లా విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో, పోటీల్లో పాల్గొని జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించిన సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్ షీల్డ్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు జిల్లాకు మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా జిల్లా పేరును అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్పోర్ట్స్ ఇన్‌చార్జి శాంతి కుమార్, ఐఈఆర్పీలు సతీష్, సుజాత, రమణ, ప్రత్యేక విద్యావేత్త మహేష్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.