calender_icon.png 23 October, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరికాల సబ్ సెంటర్ పరిధిలో వైద్య శిబిరం

23-10-2025 01:48:49 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 22(విజయక్రాంతి): ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం మరి కాల సబ్ సెంటర్లోని గ్రామాలలో మాతా శిశు సంరక్షణ వైద్య వైద్య అధికారి భాస్కర్ ఆధ్వర్యం లో జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్ర మం లో భాగంగా చంటి పిల్ల తల్లులకు తప్పనిసరిగా వ్యాధి నిరోక టీకాలు వేయించాలని తెలిపారు. గ్రామాలలో కొత్తూరు, రామాంజపురంలో వైద్య శిబిరం నిర్వహించి గర్భవ తులను, బాలింతలను పరీక్షించారు.పరీక్షించుకున్న వారిలో రక్తపోటు, మధుమేహం వారికి నెలవారి మందులు, గర్భవతులకు, రక్తహీనత ఉన్నవారికి వైద్యాధికారి గారు మాత్రలు అందజేయడం చేయడం జరిగిం ది.

శిబిరంలో పరీక్షించుకున్న వారు 42 మం ది గర్భవతులు, ఆరుగురు బాలింతలు, నలుగురు క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఒక రక్త పూత సేకరణ, రెండు ఆర్డిటి నిర్ధారణ పరీక్షలు, రెండు నెగిటివ్గా నిర్ధారించడం జరిగిం ది. ఈ కార్యక్రమంలో మాతా శిశువు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్,హెచ్‌ఇఓ కోటిరెడ్డి, స్టాఫ్ నర్స్ స్వప్న,ఏఎన్‌ఎం ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.