calender_icon.png 23 October, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

23-10-2025 01:47:52 AM

- శిర్సనగండ్లలో ఒకే రోజు 8 మందిఫై దాడి

- ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

- కుక్కల ఏరివేతకు స్వయంగా రంగంలోకి దిగిన యువకులు 

చారకొండ, అక్టోబర్ 22: గ్రామాల్లో ఎక్కడా చూసినా శునకాలు గుంపులు గుం పులుగా సంచరిస్తూ కనిపించిన వారిని వెం టాడుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన వారిపై దాడి చేస్తున్నాయి. చారకొం డ మండలంలోని ఏ గ్రామంలో చూసినా ప దుల సంఖ్యలో శునకాలు వీధుల్లో తిరుగుతుండడంతో వృద్ధులు చిన్నారులు, సామా న్య జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. నిత్యం కుక్కకాటుకు గురై బాధితులు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి ఏర్పడింది.

తాజాగా మండలంలోని శిరసనగండ్ల గ్రా మంలో బుధవారం కుక్కల దాడిలో 8 మం ది తీవ్రంగా గాయపడ్డారంటే పరిస్థితి ఎలా గో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా గ్రామంలో కుక్కల స్త్వ్రర విహారంపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.- ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు.చారకొండ మండల కేం ద్రంతో పాటు శిరసనగండ్ల, అయోధ్య న గర్, శాంతిగూడెం, సూర్యగేట్ తండా, జూపల్లి, గోకారం గ్రామాల్లో రాత్రి అయితే రహదారులపై కుక్కలు గుంపులుగా చేరి ద్విచక్రవాహన దారులను వెంట బడటంతో వాటి బారి నుంచి తప్పించుకోబోయి ప్ర మాదాల బారిన పడిన సంఘటనలు అనే కం.

కుక్కల ఏరివేతకు రంగంలోకి యువకు లు.కుక్కల స్త్వ్రర విహారంపై అధికారులకు ఎ న్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవ డం బుధవారం శిరుసనగండ్ల గ్రామ యువకులు స్వయంగా రంగంలోకి దిగి కుక్కల ఏరివేతకు నడుం బిగించారు. సామాన్యులపై దాడి చేసి రక్త గాయాలకు కార ణమైన కుక్కలను వెంటాడుతూ గ్రామాల పొలిమేర వరకు పరుగులు పెట్టించారు. ప్ర భుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి కు క్కల ఏరివేతకు చర్యలు తీసుకోవాలనికోరారు.