calender_icon.png 23 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కళాశాలలో అవగాహన సదస్సు

23-10-2025 01:50:22 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 22(విజయ క్రాంతి): వెంకటాపురం మండల కేంద్రం లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో యువత విద్యను మెరుగుపరుచుకునే అవకాశాల గురించి బుధవారం కాఫెడ్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాఫెడ్ స్వచ్చంధ సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు,కళాశాల లెక్చరర్ రామకృష్ణ పాల్గొన్నారు.

రామకృష్ణ మాట్లాడు తూ ప్రతీ విద్యార్థి క్రమం తప్పకుండా కాలేజీకి రావాలని, చదువు పట్ల శ్రద్ధ కలిగి మం చిగా చదువుకోవాలని తెలియ చేశారు. డైరెక్టర్ లూర్ధు రాజు మాట్లాడుతూ ప్రతి విద్యా ర్థికి జీవితం లో   లక్ష్యం ఉండాలని, అది సా ధించే వరకు పట్టుదలతో ఉండాలని తెలియ చేశారు.

అలానే యువత మొబైల్ ఫోన్ లకు దూరం గా ఉండాలని, మంచిగా చదువుకుని అందరూ మంచి స్థాయి లో ఉండాలని తల్లి తండ్రులకు మంచి పేరు తీసుకొని రా వాలని తెలియజేశారు. కళాశాల విద్యార్థులు తొంబై మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కళాశాల లెక్చరర్స్, కాఫెడ్ సంస్థ వెంక టాపురo కోఆర్డినేటర్ జి హనుమంత్, వాజే డు మండల కోఆర్డినేటర్ జి కామేష్, యానిమేటర్స్ భాస్కర్, ఇందిరా, ఉష, పద్మ పాల్గొన్నారు.